మహేశ్వరం
నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న నాళాల నిర్మాణం, చెరువుల సుందరీకరణ పనులను త్వరితగతిన
పూర్తి చేయాలని ఎమ్మెల్యే సబితాఇంద్రా రెడ్డి సంబంధిత
అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మీర్ పేట్ లోని ఆమె క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ,
హెచ్ఎండీఏ,
ఇరిగేషన్ శాఖ
అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ
సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెరువుల్లోకి
చేరుతున్న మురుగునీటిని అడ్డుకునేలా నాళాలు నిర్మించి, నీటిని మళ్లించే ఏర్పాట్లు చేయాలని
సూచించారు. గతంలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన నాళాల్లో పూడిక చేరిన
విషయాన్ని ప్రస్తావిస్తూ, వెంటనే
డీసిల్టింగ్ చేపట్టి రెండో దశ పనులు పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.
లెనిన్‌నగర్,
మిథిలానగర్
ప్రాంతాల్లో ఎస్ఎన్డీపీ పనులు
మీర్పేట
పరిధిలోని లెనిన్‌నగర్,
మిథిలానగర్ ప్రాంతాల
ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి
తీసుకువచ్చారు. ఈ ప్రాంతాల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎస్ఎన్డీపీ
(SNDP) పనులను
యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని ఆమె ఆదేశించారు.
నాళాల
నిర్మాణం పూర్తైన అనంతరం చెరువుల సుందరీకరణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.
నాలుగు చెరువుల అభివృద్ధికి నిధుల మంజూరు
ఈ
సమావేశంలో ఎమ్మెల్యే సబితారెడ్డి కీలక ప్రకటన చేశారు.
జిల్లెలగూడ
చందనచెరువు, మీర్పేట
పెద్దచెరువు, జల్పల్లి
చెరువు, రావిర్యాల
చెరువుల అభివృద్ధికి హెచ్ఎండీఏ నిధులు మంజూరైనట్లు
తెలిపారు. ఒక్కో చెరువుకు రూ.3 కోట్ల చొప్పున నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.
ఈ
నిధులతో చెరువుల సుందరీకరణ, నీటి
నిల్వ సామర్థ్యం పెంపు, పరిసర
ప్రాంతాల అభివృద్ధి చేపట్టాలని అధికారులకు సూచించారు.
సమన్వయంతో పనులు పూర్తి చేయాలి
అభివృద్ధి
పనులు సకాలంలో పూర్తయ్యేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్
శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. పనుల్లో నాణ్యత లోపించకూడదని,
ప్రజలకు ఎలాంటి
ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు
ఈ
సమీక్ష సమావేశంలో జీహెచ్ఎంసీ
ఎస్ఈ కృష్ణప్రసాద్, పబ్లిక్ హెల్త్
ఈఈ ప్రభాకర్రెడ్డి, డీఈ యాదయ్య, బడంగ్‌పేట్
సర్కిల్ డీఈ వెంకన్న, ఏఈ హరీష్ తదితర
అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి